డేటా ఎంట్రీ ఆపరేటర్లు లబ్ధిదారుల వివరాలు తప్పుగా నమోదు చేస్తున్నారని ఎంపిడీఓకు బిజెపి పార్టీ నాయకులు వినతి పత్రం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల ఎంపీడీఓ ప్రసాద్ కి మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరుగారంటీల పేరుతో ప్రజా పాలన అనే కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది దరఖాస్తులు ఆన్లైన్ చేసే క్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు లబ్ధిదారుల వివరాలు తప్పుగా నమోదు చేశారు దీంతో చాలామందికి 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్తు 500 కే గ్యాస్ సిలిండర్ అందకుండా అన్యాయం చేయడం జరిగింది కాబట్టి ఇట్టి విషయాన్ని వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని పోయి పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పుగా నమోదు చేసిన డేటేను సవరణ చేసి ప్రజలను ఆదుకోవాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య,మండల ప్రధానకార్యదర్సులు బందెల రవి గౌడ్,సీపిరిశెట్టి శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు చుంచు మల్లవ్వ,లక్ష్మి నారాయణ, బోడ అమృత,నర్సింగునాయకు పి స్ సి స్ గూడెం చెర్మెన్ బేడుదా సురేష్,మాజీ వైస్ ఎంపీపీ చిట్ల శ్రీనివాస్,జిల్లా మాజీ గ్రంధాలయం డైరెక్టర్ చిర్ల వెంకటేశ్వర్లు,మాజీ సర్పంచ్లు డంక లక్ష్మణ్, గడికొప్పుల రజిని సురేందర్, మాజీ ఉపసర్పంచ్ దుమ్మని సత్తయ్య,మండల ఉపాధ్యక్షలు కర్ణల కిషన్,కిసాన్ మోర్స్ మండల అధ్యక్షులు వనపర్తి రాకేష్,బీసీ మోర్స్ మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు గుర్రం రాజన్న, కమ్మల బుచ్చన్న,గంగాధర్, రాము శెంకర్,రాజాం, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking