గోబ్రియ నాయక్ మృతికి దయాకర్ రెడ్డి సంతాపం

 

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని కస్నా తండా కి చెందిన తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రామ్మూర్తి తండ్రి అజ్మీరా గోబ్రియ నాయక్ అనారోగ్యంతో అకాల మరణం పొందారు. ఈ సందర్భంగా కస్నా తండాలోని ఆయన మృతదేహాన్ని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గోబ్రియ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థించారు. దయాకర్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కళ్ళెం వెంకట రెడ్డి తదితరులున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking