నిత్యన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న క్షేత్రంలో గల సాయిబాబా ఆలయంలో గురువారం నిత్యన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిత్యన్నాదాన కార్యక్రమం ఆలోచన రావడం అభినందనీయమని అన్నారు. సాయిబాబా ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని, బాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు. అంతకుముందు బాబాకు ప్రత్యేక పూజలు జరిపారు. డీసీసీ అధ్యక్షులు నిత్యన్నదానానికి రూ. 51,116 వేల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, గాంగోని బురాజ్ ,ఆకుల హరీష్,కొంతం గణేష్,కొట్టే శేఖర్ ,రాంరెడ్డి,పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking