ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 4 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం వివాహానికి సంబంధించి ముహూర్తాలు ఈనెల 28 తో ముగిసిన తర్వాత తిరిగి ఆగస్టు నెలలో మాత్రమే ముహూర్తాలు ఉండటం వలన వివాహ కార్యక్రమాలు ఇబ్బందిగా కొనసాగుతున్నాయి. దీనివలన రాజకీయ నాయకులు విరామం లేకుండా, సూర్యుని అధిక వేడిమిని సైతం తట్టుకుంటూ కార్యక్రమాలకు హాజరు కావలసి వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకు 12 వివాహ కార్యక్రమాలలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు.కామేపల్లి మండలం కెప్టెన్ బంజర గ్రామానికి చెందిన జర్పలా లాలు – పార్వతిల కూతురు అనిత, సురేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొత్త తండా – ముత్యాలంపాడు గ్రామానికి చెందిన భూక్యా సోన,కేలి, ఇస్తారిల కూతురు డాక్టర్ అరుణ, డాక్టర్ సాగర్ ల వివాహం
టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన బైకానీమాధవి – సర్వేష్( లేట్)ల కుమారుడు నరేష్ రమ్యల వివాహం పండితాపురం గ్రామానికి చెందిన ఆంగోత్ రామకోటి – విజయల కూతురు మౌనిక, రమేష్ ల వివాహం, పండితాపురం గ్రామానికి చెందిన బానోత్ శంకర్ నాయక్ – విజయ ల కూతురు భావన, సాయిల వివాహం చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన గోపి యాదవ్- అభినయల వివాహం, ఖమ్మం రూరల్ మండలం గూడూరు పాడు గ్రామానికి చెందిన అల్లిక నరసయ్య పద్మ ల కుమారుడు సాయి- త్రివేణిల వివాహాలకు మరియు ఖమ్మం నగరంలో ఇల్లందు పట్టణంలో వివాహాల కార్యక్రమాలలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో అల్లిక నరసయ్య, అల్లిక వెంకటేశ్వర్లు, బానోతు నరసింహ నాయక్, భూక్య నాగేంద్రబాబు, పాటిబండ్ల ప్రసాద్, మేకల మల్లికార్జునరావు, పగడాల నాగేశ్వరరావు, మేకల సురేష్, సాయి, ఆంగోత్ రవి, జర్పల లాలు, కేలోత్ సుక్య, బానోత్ రాంజీ తదితరులు పాల్గొన్నారు
Next Post