సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ డా. జితేందర్‌

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ డీజీపీగా నియమితులైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డా. జితేందర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. జితేందర్‌ 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌ అధికారి. ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు.తొలుత నిర్మల్‌ ఏఎస్పీగా పని చేశారు. అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. మహబూబ్‌ నగర్‌, గుంటూరులలో ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత ఢల్లీిలో 2004 నుంచి 2006 వరకు సీబీఐలో గ్రేహౌండ్స్‌లో పని చేశారు. అనంతరం డీజీపీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్‌లో బాధ్యతలు నిర్వర్తించారు.
అప్పాలో కొంతకాలం పని చేశారు. ఆ తర్వాత వరంగల్‌ రేంజ్‌ డీఐజీగా పని చేశారు. ఏపీ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌గా పని చేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీఐజీగా, జైళ్ల శాఖ డీజీగా పని చేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. డీజీపీగా 14 నెలలు కొనసాగే అవకాశముంది.
తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
15 మంది ఐపీఎస్‌ల బదిలీలు
హైదరాబాద్‌ జోన్‌ ఐజీగా సత్యనారాయణ
ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషి
గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర
వరంగల్‌ ఐజీగా చంద్రశేఖర్‌
హోంగార్డ్స్‌ ఎడీజీ గా స్వాతి లక్రా
లా అండ్‌ ఆర్డర్‌ ఎడీజీ గా మహేష్‌ భగవత్‌
రాచకొండ సీపీగా సుధీర్‌ బాబు
డీఎస్పీ బెటాలియన్‌ ఎడీజీ గా సంజయ్‌ కుమార్‌
రైల్వేస్‌ ఐజీగా రమేష్‌ నాయుడు
వనపర్తి ఎస్పీగా గిరిధర్‌
సౌత్‌ వెస్ట్‌ డీసీపీగా చంద్రమోహన్‌
మెదక్‌ ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌ రెడ్డి
మల్టీ జోన్‌ – 1 ఐజీగా చంద్రశేఖర్‌ రెడ్డి
సిటి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ డీసీపీగా రక్షితా మూర్తి
హైదరాబాద్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీబా బాలస్వామి

Leave A Reply

Your email address will not be published.

Breaking