సీఐటీయు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ధర్నా.

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26 : కలెక్టర్ కార్యాలయం ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.అంగన్వాడీ టీచర్స్& హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా భానుమతి అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.వేమూనూరి నిర్మల అమృత,స్వాతి అంగన్వాడీ హెల్పర్లు మాట్లాడుతూ…గత 20 ఏళ్ల నుంచి మేము అంగన్వాడి హెల్పర్లుగా పని చేస్తున్నాము.గతంలో ప్రభుత్వం పదవ తరగతితో ప్రమోషన్లు తీసుకుంది.కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్లకు ఇంటర్మీడియట్ అర్హత పెట్టడం సరైనది కాదు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది అంగన్వాడి హెల్పర్లు నష్టపోతారు.ఇప్పటివరకు విద్య అర్హత ఎఎస్ఎస్ స్సి పెట్టి ఉన్నపలంగా రెగ్యులర్ ఇంటర్ ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది.దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర అనేక రాష్ట్రంలో ఎస్ఎస్ సి ప్రకారం హెల్పర్లకు ప్రమోషన్ ఇస్తున్నారు.పాత పద్ధతి ద్వారానే ఎస్ ఎస్ఎస్సి అర్హత ప్రకారమే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలు పెంచాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి. జీవితంలో సగం పెన్షన్,ఉద్యోగ భద్రత, సౌకర్యాలు కల్పించాలి. శిథిలావస్థలో ఉన్న కేంద్రాలను తొలగించి,కొత్త నిర్మాణాలు చేపట్టాలి. బెనిఫిషర్లకు అందుబాటులో అంగన్వాడి కేంద్రాలు నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో పెండింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్లు,ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలి.ఇతర సమస్యల పరిష్కరించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జి.ప్రకాష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు,విరోనిక, రాజేశ్వరి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు మరియు హెల్పర్లు స్వరూప,స్వాతి, లావణ్య,స్వరూప మధులత,అనూష,పద్మ, స్రవంతి,కౌసల్య,మీనాక్షి, శారదా,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking