విధులు బహిష్కరించిన న్యాయ వాదులు.

కేసు విషయంలో క్లైంట్ తరుపున మాట్లాడడానికి వెళ్లిన న్యాయవాది పై సిద్దిపేట టూ టౌన్ ఏఎస్ఐ దాడి చేసిన సంఘటనలో న్యాయవాదికి న్యాయం చేయాలంటూ కరీంనగర్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి రఘువీర్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం న్యాయ వాదులు తమ విధులను బహిష్కరించారు. జిల్లా కోర్టు ఆవరణలో పోర్టకో ముందు పెద్ద ఎత్తున నిరనలు చేపట్టారు. ఈ సందర్బంగా న్యాయవాదులు మాట్లాడుతూ బాధితుడి తరుపున ఫిర్యాదు చేయడానికి న్యాయవాది వస్తే వారి ఫిర్యాదును పట్టించుకోకపోగా విధులకు ఆటంకం కలిగించాడంటూ బాధిత న్యాయవాదిపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం పోలీసుల తీరును తెలియజేస్తుందన్నారు. న్యాయవాది ఎం రవి కుమార్ పై అక్రమంగా దాడి చేసిన ఏఎస్ఐ ఉమారెడ్డి ని సస్పెండ్ చేయాలని, సి ఐ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సుంకె దేవా కిషన్, బెజ్జంకి శ్రీకాంత్, పస్తం అంజనేయులు, సీనియర్ న్యాయవాదులు డి మల్లయ్య, ఆర్ దేవేందర్ రెడ్డి, లక్ష్మణ్ రావు, కొత్త ప్రకాశ్, టి శ్రీనివాస్, శ్రీధర్ రావు, ఎస్ శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking