రామ్‌లల్లా యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శుభ ఘడియల కార్యక్రమం దిగ్విజయంగా జరిపిన సందర్భంగా అన్న ప్రసాద వితరణ
రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 22 జనవరి 2024: అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి 2.7 ఎకరాలలో 57,400 చ.అ నిర్మాణ-ప్రాంతంతో నాగర్ సాంప్రదాయ శైలిలో నృత్య, రంగు, సభ, ప్రార్థన, కీర్తన మంటపాలతో తూర్పు పడమరల పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులతో, 392 స్తంభాలతో, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో మూడంతస్తులుగా కట్టిన మహ మాన్విత రామమందిర భవ్య క్షేత్రంలోని గర్భగుడిలో చారిత్రాత్మక రామ్‌లల్లా యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శుభ ఘడియల కార్యక్రమం దిగ్విజయంగా జరిపిన సందర్భంలో వీ ఆర్ ఫర్ సహాయోగ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మణికొండ పైప్ లైన్ రోడ్ లోగల లేబర్ అడ్డా వద్ద భక్త జనులందరూ ముగ్దులయ్యే విధముగా వారికి వీణుల విందుగా వినిపించిన భజన కీర్తనలు వింటూ, విచ్చేసిన భక్తులందరు భక్తి భావనతో వారి నుదుటన కుంకుమ తిలక ధారణ గావించుకొని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 3 ప్లై సర్జికల్ మాస్క్ లు ఉచితంగా అందుకోవడంతో పాటు పూజా ప్రసాదం ప్యాకెట్లు మరియూ ఆరోగ్య ప్రాధాన్యమైన ధాన్యం ప్యాకెట్లు దరిదాపు 500 మంది భక్తులు ఉచితముగా అందుకోవడం జరిగినదని, భక్తులందరు వాటిని గైకొని తలపెట్టిన ఏర్పాట్లకు సంతుస్టులైనారనీ ఇట్టి సదవకాశాన్ని ఉపయోగించుకొని ఆ మహమహుడు శ్రీరాముని కృపా కటాక్షములకు పాత్రులైనారని ఈ శుభ సందర్భంలో ట్రస్ట్ సభ్యులు నిర్మల్ చంద్ గోలేచ, దిలీప్ కక్కడ్, అందె లక్ష్మణ్ రావు, తబ్రెజ్ హుస్సేన్, మోహన్ కుమార్ పానిగ్రహి, శ్రీనాథ్ రచ్చా, ఆనంద్ విశ్వకర్మ, బండారి నరేశ్ లతో పాటు సామాజిక కార్యకర్తలు బండారు మనోజ్, మహమ్మద్ ఇస్మాయిల్, విజయ్ కుమార్ గౌడ్, దొరస్వామి, పురజన ప్రముఖులు, భక్తులు తది తరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం గావించినారని ట్రస్ట్ సభ్యులు తెలియ జేసినారు. జై శ్రీరామ్.