మహాలక్ష్మీ వాడ యూత్ ఆధ్వర్యంలో అక్షింతల పంపిణీ,అన్నదానం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 09 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని మహాలక్ష్మీ వాడ యూత్ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్ ఆలయం వద్ద అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల పంపిణీ,అన్నదాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ రాముని అక్షింతలను అందుకున్నారు. యూత్ సభ్యులు భక్తి శ్రద్ధలతో వంటలు తయారు చేసి భక్తులకు వడ్డించారు. అంతకుముందు పలు ప్రత్యేక పూజలు,భక్తి పాటలతో అయోధ్య శ్రీ రాముని పట్ల తమ భక్తిని చాటుకున్నారు.అందరూ అన్ని మతాలను సమానంగా చూడాలని,దేశంలో మత సామరస్యాన్ని చాటాలని మహాలక్ష్మీ వాడ పెద్దలు ప్రజలందరికీ సూచించారు. అన్నదానం అన్ని దానాల కంటే గొప్పదని,మహాలక్ష్మీ వాడ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మెట్టు రాజు, సందీప్ యాదవ్,శేఖర్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking