దివ్యాంగులకు ప్రేమ్ సాగర్ రావు సహాయంతో బస్ పాస్ కార్డ్ పంపిణీ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 24 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం లోని సుమారు 700 మంది దివ్యాంగులు (వికలాంగులు) కు ఆర్టీసీ బస్సు లో 50 శాతం రాయితీ పై ప్రయాణించే అవకాశాన్ని మాజీ ఎమ్మెల్సీ,ఎఐసిసి సభ్యులు కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావు కల్పించారు. ఇందు కోసం ఆర్టీసీ రవాణా శాఖ కు చెల్లించవలసిన సొమ్మును ప్రేమ్ సాగర్ రావు స్వంత కర్చుతో చెల్లించారు.ఇట్టి కార్డు లను గురువారం దండేపల్లి మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందచేశారు..ఈ సందర్భంగా ఆర్ జి పి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ… దివ్యంగుల కోసం ప్రేమ్ సాగర రావు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వికలాంగులు సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుంది అన్నారు.ఈ కార్యక్రమం లో పార్టీ మండల అధ్యక్షులు, దండేపల్లి ఎంపీపీ,జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్, మండల అధ్యక్షుడు అక్కల అక్కల వెంకటేష్, యూత్ అధ్యక్షుడు ఆకుల దుర్గాప్రసాద్, సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking