కల్యాణ లక్ష్మి,షాదిముబారక్ చెక్కులు పంపిణీ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 : మంచిర్యాల నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు.మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో 15 మందికి కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అర్హులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కొత్తగా కళ్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి అదనంగా బంగారం కానుకగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులకు,కౌలు రైతులకు భరోసా కింద 15 వేలు, కూలీలకు 12 వేలు,500 వరికి బోనస్ గా ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 ఆర్ధిక చేయూత,500 రూపాయల కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల విద్యుత్ వాడకం ఉచితం,ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు ఇలా కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలు అమలు చేసి తీరుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. వంద రోజుల్లో దశల వారిగా పథకాలు అమలు జరుగుతాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ముకు పెద్ద ఎత్తున నిధులు తీదుకువచ్చి అభివృద్ధి లో ముందు వరుసలో నిలిచేలా అంకితభావంతో పని చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking