బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాల నోట్ బుక్స్ పెన్నుల పంపిణీ

మట్ట పవన్ రెడ్డి యువమోర్చా నాయకులు

ఇల్లంతకుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 11

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ 53వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భారతీయ జనతా యువమోర్చా సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పిల్లలకు నోటుబుక్కులు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా నాయకులు మట్ట పవన్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అమ్మవారి ఆశీస్సులతో రానున్న కాలంలో కరీంనగర్ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి, గ్రామ బూత్ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాసరెడ్డి, ఈరబోయిన సతీష్, బండి రాజు,పోలు సంపత్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking