అనాధ పిల్లలకు బియ్యం పంపిణీ

– ప్రతి ఒక్కరూ సేవ గుణం కలిగి ఉండాలి.

– ప్రజా శివసేన సమితి అధ్యక్షుడు బోల్ల స్వామి

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి జులై 3

ప్రజా శివసేన సేవా సమితి ఆధ్వర్యంలో స్పందన అనాధ ఆశ్రమంలో 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా శివసేన సేవా సమితి వ్యవస్థాప అధ్యక్షులు బోల్ల స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలని, ముఖ్యంగా యువత ప్రతి ఊళ్లో ప్రతిపటనలో ప్రతి వార్డులో యువత ముందంజలో ఉండి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.ముఖ్యంగా యువత కొందరు గంజాయి కి బానిస అవుతున్నారు. ప్రతి ఊళ్లో ప్రతి వార్డులో గంజాయిని తరిమికొట్టేందుకు ఉద్యమం యువత ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల రాకేష్. సిరిమ్లల్లా రాకేష్.ఏం మహేష్. నేదురి రాకేష్. కొమ్ము రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking