మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి జిల్లా అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 10 (ప్రజాబలం) ఖమ్మం మిర్చి రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి మిర్చి కొనుగోళ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మిర్చి ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు సరియైన తేమ, నాణ్యమైన మిర్చిని అమ్మకానికి తెచ్చి మంచి ధర పొందాలన్నారు. జిల్లాలో 2023-24 సంవత్సరంలో ఉద్యానవన శాఖ అంచనా ప్రకారం రైతులు 92,274 ఎకరాల్లో మిర్చి సాగుచేసినట్లు, 23,06,860 క్వింటాళ్ల మిర్చి దిగుబడి రానున్నట్లు ఆయన అన్నారు. ఇంతవరకు మార్కెట్ కమిటీల ద్వారా 66,840 క్వింటాళ్ల మిర్చి కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన మిర్చి తెచ్చే విధంగా అధికారులు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఈ సందర్భంగా పిడి ఎంఐపి రమణ, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బజారు, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking