డెంగ్యూ వ్యాధి నివారణ పై ప్రత్యేక చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 15 : జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ జిల్లా కార్యాలయంల భావన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా మలేరియా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, మాస్ మీడియా అధికారి బుక్య వెంకటేశ్వర్లు లతో కలిసి ఫ్లెక్సీ కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో డెంగ్యూ వ్యాధి నియంకరణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ప్రజలు డెంగ్యూ వ్యాధి పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని సదుపాయాలు, చికిత్సలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ 16 వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగు వ్యాధి వ్యాప్తి నియంత్రణ చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో పల్లె దవాఖానాలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలు, ఉప కేంద్రాలకు కలపత్రాలు, గోడపత్రాలు,పంపించడం జరుగుతుందని తెలిపారు.ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వస్తుందని, తీవ్రమైన తలనొప్పి, జ్వరం, శరీరంపై దుద్దుర్లు,చర్మం ద్వారా రక్త స్రావం,కండరాలు- కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం జరుగుతుందని తెలిపారు, వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రుకి వేళ్ళి తగిన చికిత్స చేసుకోవాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివాస ప్రాంతలలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని,మురుగు కాలువలలో నీరు నిల్వ ఇచ్చినట్లయితే కిరోసిన్ కానీ,కాలిన నూనె కానీ చెల్లెలిని, ఇంటి పరిసరాలలో ఎక్కువ చెత్త లేకుండా శుభ్రపరచుకోవాలని, ప్రతి మంగళ శుక్రవారంలో డ్రైడే పాటించి దోమలను లార్వా దశలోనే నిర్మూలించేలా ప్రజలు సహకరించాలని ఆరోగ్య, అంగన్వాడి కార్యకర్తలు, స్వచ్ఛందంగా మహిళ ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వ్యాది లక్షణాలను పరిశీలించి, ఉన్నట్లయితే వెంటనే సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నివాస ప్రాంతాలు, పరిసరాల పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలుపారు. ఈ కార్యక్రమంలో మలేరియా సాంకేతిక పరిరక్షకులు సంతోష్ సమంతా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking