ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగం,ల్యాబ్, డయాలసిస్ కేంద్రం, ఇన్ పేషెంట్,ఔట్ పేషెంట్ విభాగాలు, వయోవృద్ధుల ఫిజియోథెరపీ, ఆరోగ్యశ్రీ, జనరల్ వార్డు లను పరిశీలించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, చికిత్సలకు సంబంధించి వివరాలను వైద్యులను,సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న వైద్యచికిత్సల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.వైద్యులు సమయపాలన పాటించాలని, భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆరోగ్య మిత్ర సేవలు ప్రతి ఫ్లోర్ లో ఏర్పాటు చేయాలను అన్నారు. వివిధ విభాగాలకు సంబందించి సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని, ఆసుపత్రిలో అందిస్తున్న సేవలకు సంబంధించి సమాచారాన్ని డిజిటల్ డిస్ప్లే చేయాలనీ ఆదేశించారు.ఆసుపత్రి పరిసరాలు, మరుగుదొడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. చికిత్సకోసం వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.విధులపై నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఫిజియోథెరపీ, క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణాలను పరిశీలించి వైద్యాధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డా.రవీందర్,వైద్యులు ప్రసాద్,శ్రీనివాస్, దరహాస,అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking