నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు

 

మంగళవారం కడెం ప్రాజెక్టును ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆమె సందర్శించి, ప్రస్తుత ప్రాజెక్టు నీటిమట్టం,ఇన్ ఫ్లో, జరుగుతున్న గేట్ల మరమ్మతుల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులు, ఇతర పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం అయినా నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టు ఆపరేషన్ సిస్టం ను పర్యవేక్షించాలని అన్నారు. ప్రతిరోజూ ప్రాజెక్టు నీటిమట్టం, ఇన్ ఫ్లో పరిశీలించాలని, అత్యాధునిక ప్రమాద హెచ్చరికల వ్యవస్థ ఉన్నందున నిరంతరం పర్యవేక్షిస్తూ ముందస్తు సమాచారాన్ని సమీప గ్రామాల ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేయాలనీ అధికారులకు సూచించారు.చేపట్టిన పనులు,నిర్వహణ తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకల్యాణి, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్,ఎస్ ఈ రవీందర్,ఈ ఈ విఠల్,తహసీల్దార్ సుజాత,ఎంపీడివో అరుణ,అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking