మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం పెంచాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 21 (ప్రజాబలం) ఖమ్మం మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. గురువారం కలెక్టర్ నేలకొండపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు పరిశీలించారు. అటెండెంట్ వెయిటింగ్ హాల్, శవ పరీక్షా కేంద్రాలను వాడుకలోకి తేవాలన్నారు. రోజువారి ఓపి ఎంత మంది వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ రక్త పరీక్షలు చేస్తున్నది, రిపోర్టులు ఇస్తున్నది అడిగి తెలుసుకున్నారు. వార్డులు పరిశీలించారు. 24 గ్రామాల ప్రజలు ఆసుపత్రికి వస్తారని, ఆసుపత్రిని బలోపేతం చేయనున్నట్లు ఆయన అన్నారు. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రస్తుతం ఒక రెగ్యులర్ వైద్యాధికారి ఉండగా, మరోకరు అవుట్ సోర్సింగ్ ఉన్నారని, త్వరలో అదనంగా ఇద్దరు డాక్టర్లను ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీడుకోవాలని ఆయన అన్నారు అంతకుముందు కలెక్టర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనుల పురోగతిని తనిఖీలు చేశారు. రూ. 37 లక్షల విద్యాశాఖ నిధులు, రూ. 30 లక్షల ఉపాధి హామీ నిధులతో మరమ్మత్తులు ప్రహారిగోడ, కిచెన్ షేడ్, త్రాగునీటి పనులు, టాయిలెట్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. మిగులు పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారుఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్ డిఇఓ సోమశేఖరశర్మ ఎంఇఓ రాములు ఎంపిడిఓ జమలా రెడ్డి తహసీల్దార్ అనురాధ అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking