ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 07 : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్య వేక్షణ కమిటీ సమావేశంలో అధికారులపై ఎంపీ కఠిన ప్రశ్నలు వేస్తూ,జిల్లాలోని అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా విచారణ జరిపారు. ప్రాజెక్టులు నిర్దిష్ట కాలానికి పూర్తవుతున్నాయా లేదా,నిధుల వినియోగం సరైనదా,ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత ఉందా వంటి పలు అంశాలపై అధికారులను ప్రశ్నలతో ముక్కుతిప్పలు పెట్టారు.అభివృద్ధి పనులపై పూర్తిస్థాయి స్పష్టత కోరుతూ ఎంపీ,ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు.జిల్లా ప్రజలకు మంచినీరు,రోడ్డు మార్గాలు, విద్య,వైద్యం వంటి అంశాల్లో మెరుగైన సదుపాయాలు అందించే దిశగా అధికారులు మరింత శ్రద్ధ తీసుకోవాలని హితవు పలికారు.ఈ సమావేశంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్,ఖానాపూర్ ఎమ్మెల్యే,కలెక్టర్,డి ఆర్ డి ఓ,ఇతర అధికారులు ఎంపీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది.దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు జిల్లా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజల సంక్షేమానికి తోడ్పడతాయనే నమ్మకంతో ముందుకు సాగాలని పెద్దపల్లి ఎంపీ దిశా కమిటీ చైర్మన్ వంశీ కృష్ణ అదేశాలు జారి చేశారు.