ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని జిల్లా వ్యవసాయ అధికారి గధరాజు కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు వాతావరణంలోకి వెళతాయని,ఈ ప్రభావం పంటలు, నేలపై పడి భూమి పోషక విలువ తగ్గిపోతుందని తెలిపారు.వరి కొయ్య వ్యర్థాలను కాల్చడం మానుకొని 4 వేల విలువ గల మిషనరీలు, భాస్వరం,పొటాష్ వంటి ఎరువులుగా మార్చుకోవచ్చని తెలిపారు.వేరుశెనగ వంటి వ్యర్థాలను విలువైన ద్రవ్యాలుగా మార్చకోవచ్చని తెలిపారు.రైతులు ఈ సూచనలు పాటిస్తే అందరికీ మేలు జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.పత్తి, మిర్చి,మొక్కజొన్న, కంది కొయ్యలను పంట చేరుకుగా వాడుకోవచ్చని, సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చని, పుట్టగొడుగుల సాగుకు వినియోగించవచ్చని, నేలలో కలియ దున్నడంతో కార్బన స్థాయి పెరుగుతుందని,నేల మీద మల్చ్ ఉపయోగించవచ్చని తెలిపారు.రైతులు భూసారాన్ని కాపాడుకునేందుకు వ్యవసాయ, విస్తరణాధికారులను సంప్రదించి తగు సూచనలు పొందాలని,సరైన మెళకువలు పాటిస్తూ పంట సాగు చేసి అధిక దిగుబడి పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.