18 నెలల శిశువుకి మెడపై ఉన్న సంక్లిష్టమైన కణితిని తొలగించిన  మెడికవర్ హాస్పిటల్స్‌ వైద్యులు.

 

ప్రజాబలం శేర్లింగంపల్లి 18 నెలల శిశువుకి తలకి వెన్నెముకకి మధ్యలో మెడ మీద ఉన్న సంక్లిష్టమైన కణితిని తొలగించి శిశువు నడిచేటట్లు చేసిన  మెడికవర్ హాస్పిటల్స్‌ వైద్యులు.
కణితి కారణంగా 18 నెలల శిశువు గత ఎనిమిది నెలలుగా ఏడవడం, తల తిప్పకపోవడం, తీవ్రమైన కాలునొప్పి,  నడవలేని స్థితి,శ్వాసతీసుకోలేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నది.  మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోస్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించారు. డాక్టర్లు న్యూరోమానిటరింగ్ పద్ధతులను ఉపయోగించి కణితిని పూర్తిగా తొలగించేలా చేశారు.  శస్త్రచికిత్స జరిగిన రెండవ రోజు నుంచే శిశువు పరిస్థితి మెరుగుపడటం వారంలోనే పూర్తిగా నయమై ఇప్పుడు శిశువు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి నడవగలుగుతుంది. అనంతరం శిశువు తల్లి తండ్రులు మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, సదుపాయాలు  అనుభజ్ఞులైన డాక్టర్స్ కలిగిన మెడికవర్ హాస్పిటల్స్  వల్లనే  మా శిశువును  రక్షించుకోగలిగామని డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి  ధన్యవాదములు తెలిపారు.డాక్టర్ నిత్య  అనస్థీషియాలజిస్ట్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి  న్యూరోస్పైన్ సర్జన్, డాక్టర్ హిదాయత్,డీఏం.ఓ న్యూరో సర్జరీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking