విద్యను వ్యాపారం చేయద్దు

బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి
జూన్ 24

కాంగ్రెస్ ప్రభుత్వం లో విద్యను వ్యాపారం చేస్తూ, తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం, మండలంలోని ప్రతి ప్రైవేట్ పాఠశాలను తనిఖీ చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ, విద్యాధికారులు మామూళ్లకు కక్కుర్తి పడుకున్నారని ఆకుల రాజేందర్ ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడం సిగ్గుచేటు, కొంతమంది సిబిఎస్ సిలబస్ పేరుతో దోపిడి చేస్తున్నారని,
దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అక్రమ ఫీజు వసూళ్లపై, సెంట్రల్ సిలబస్ పేరుతో ఫీజుల దోపిడీ అనే అనేక అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధానాలు మార్పు రావాలని, మండలంలోని ప్రభుత్వ పాఠశాలల వసతులను మరియు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ లు జరపాలని అధికారులకు కోరుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురాకపోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విద్యను వ్యాపారంగా చేశారని మండిపడ్డారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని లేదంటే మండలంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి దొంతుల రాజకుమార్, బిజెవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్, దేవులపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking