ఎంఎస్పి జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా దూమాల గంగారాం మాదిగ

 

జగిత్యాల, డిసెంబర్ 19 : మహాజన సోషలిస్టు పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా దూమాల గంగారాం మాదిగ ఎన్నికయ్యారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా ఇంచార్జి గంధమల నాగభూషణ్ అధ్యక్షతన జరిగిన ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా సమవేశంలో మహాజన సోషలిస్టు పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా
దూమల గంగారాం మాదిగ,
జగిత్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేటుపల్లి లక్ష్మణ్ మాదిగ, జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధిగా
బెజ్జంకి సతీష్ మాదిగ,
కాశివత్తుల లక్ష్మీరాజు మాదిగ,
జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా అరికిల్ల సతీష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులుగా
బోనగిరి కిషన్,
ముల్కల శ్రీనివాస్,
దెయ్యాల హన్మంత్
జిల్లా కార్యదర్శిగా
బాలే అంజన్న, జిల్లా సహాయ కార్యదర్శిగా
మీసాల సాయిలును ఎన్నుకున్నారు. అనంతరం దుమాల గంగారాం మాట్లాడుతూ మహాజన నేత మందకృష్ణ మాదిగ మా మీద నమ్మకంతో మహాజన సోషలిస్ట్ పార్టీని జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బలోపితం చేసే విధంగా ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం జెండాతో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడ్డ మహాజన సోషలిస్ట్ పార్టీని బడుగు బలహీన వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజా సమస్యల పై పోరాటం చేసి వారి సమస్యల పరిష్కారం కై ముందు నిలబడతామన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధనకై కష్టపడి పని చేస్తామని అన్నారు. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు శాతం నెరవేరుస్తామని మాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీకి, జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులకు, అన్ని అనుబంధ సంఘాల నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking