సైబర్ నేరగాళ్ళ వలలో విద్యావంతులు, అమాయక ప్రజలు, స్కూల్ మరియు కాలేజీకి వెళ్ళే యువత మోసపోవద్దు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈ రోజు నిర్మల్ జిల్లా పట్టణంలోని విన్నర్ స్కూల్ లో జిల్లా ఎస్పీ. చల్లా ప్రవీణ్ కుమార్. ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ విభాగం ఇంచార్జ్. పి.రవి కుమార్, ఎస్సై, “సైబర్ జాగ్రుక్తా దివాస్”లో భాగం గా విన్నర్ స్కూల్ లో సైబర్ క్రైమ్ నేరాల గురించి పాఠశాల విద్యార్థులకు వివరించారు. మారుతున్న కాలంతో పాటు ఇంటర్నెట్ వినియోగం కూడా ఊహించనంత అధికం అవుతోందని, అదే స్థాయిలోనూ సైబర్ నేరాలు అధికమవుతున్నాయని తెలిపారు. మొబైల్ ఫోన్ లను ఉపయోగించే క్రమంలో సైబర్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా వినియోగించని వారు ఉండరు. అందుకే సైబర్ నేరగాళ్ళు సోషల్ మీడియాని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని ఆర్ధిక నేరానికి పాలుపడుతున్నారు. సైబర్ నేరగాళ్ళ వలలో విద్యావంతులు, అమాయక ప్రజలు, స్కూల్ మరియు కాలేజీకి వెళ్ళే యువత మోసపోతున్నారు. మన చరవానికి వచ్చిన లింక్ లను క్లిక్ చేయడం ద్వారా మన వ్యక్తీ గత సమాచారాన్ని సేకరించుకొని డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. సోషల్ మీడియాలో మన ఫొటోస్ కాని కుటుంబ సభ్యుల ఫోటో లను పోస్ట్ చేయడం ద్వారా అవతలి వారు మన ఫోటోలను పరువు తీసేవిధంగా మార్ఫింగ్ చేసి డబ్బులు పంపకుంటే వైరల్ చేస్తానని బెదిరిస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందాలనే ఆశతో యువత ఇన్వెస్ట్మెంట్, వర్క్ ఫ్రొం హోం పేరుతొ ఏమైనా లింక్స్ రాగానే అది నమ్మి కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొదట్లో సైబర్ నేరగాళ్ళు కొంత లాభాలు ఇచ్చినట్టు నమ్మించి, తర్వాత పెద్ద మొత్తంలో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు ఇస్తామని చెప్పి, అధిక మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగానే, మనకు అధిక లాభాలు వచ్సినట్టు ఒక వర్చ్యువల్ ఎకౌంటు చూపిస్తారు. మనకి లాభాలు వచ్చినట్టు కన్పిస్తుంది కాని విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు.
సైబర్ నేరాల విషయంలో సూచించిన జాగ్రత్తలు ఇవే..
1. మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను తెలపకండి.
2. మీ బ్యాంక్ ఆన్ లైన్ అకౌంట్లలోకి లాగిన్ అయితే వాటిని అలాగే వదిలేయకండి.. లాగౌట్ చేయండి.
3. మీ యూఎస్‌బీలు, హార్డ్ డిస్క్ లను పబ్లిక్ కంప్యూటర్లకు కనెక్ట్ చేయకండి.
4. . బిఏటి. సిఎండి. ఈ ఎక్స్ ఈ. bat,వంటి ఎక్స్‌టెన్షన్లు ఉన్న ఫైల్స్‌ను అస్సలు ఓపెన్ చేయకండి.
5. మీ పాస్ వర్డ్ లను ఎవ్వరికీ తెలపకండి.
6. మీకు వచ్చే సమాచారం ఏదైనా దాన్ని ధ్రువీకరించుకోకుండా ఎవ్వరికీ ఫార్వర్డ్ చేయకండి.
7. రిమోట్ ఆక్సెస్ అప్లికేషన్స్ ని మీ ఫోన్ లలో ఇంస్టాల్ చేసుకోకండి.
8. మీ సోషల్ నెట్ వర్కింగ్ ఖాతాల్లో మీ స్నేహితులకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేయకండి.
9. మీ బ్యాంక్ అకౌంట్ పాస్ వర్డ్ బలంగా ఉండేలా చూసుకోండి. దాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.
10. సోషల్ నెట్ వర్కింగ్ సైటల్లో ప్రైవసీ సెట్టింగ్స్ ను బాగా జాగ్రత్తగా చదవండి.
11. మీకు సంబంధించిన డిజిటల్ సమాచారాన్ని ఎక్కడా పోస్ట్ చేయకండి.
12. మీ వ్యక్తిగత కంప్యూటర్/మొబైల్స్ ఎవరికి పడితే వారికి ఇవ్వకండి.
13. ధ్రువీకరించబడిన ఓపెన్ సోర్స్ లేదా లైసెన్స్‌డ్ సాఫ్ట్ వేర్లను మాత్రమే ఉపయోగించండి.
14. మీ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్, ఆపరేటింగ్ సిస్టం ఆటోమేటిక్ గా అప్ డేట్ అయ్యేలా సెట్టింగ్స్ మార్చుకోండి.
సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉంటూ.. తరచుగా పాస్ వర్డ్ లను మార్చడంతోపాటు అపరిచితులు సోషల్ మీడియాలో పంపే రిక్వెస్ట్ లకు స్పందించకుండా ఉండడం, వ్యక్తిగత వివరాలు, ఫోటోలను పోస్ట్ చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఏదైనా సైబర్ నేరానికి బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి.

Leave A Reply

Your email address will not be published.

Breaking