జిల్లాను అన్ని శాఖల సమన్వయంతో మరింత అభివృద్ధికి కృషి చేయాలి

మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 23:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దగ్గరగా ఉండటం వల్ల ఎంతో అభివృద్ధి చెందిందని… మరింత అభివృద్ధి జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉందన్నారు. అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు. జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు ఇదే తరహాలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, జిల్లా పంచాయతీ శాఖ, జిల్లా ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ,లు చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ అంశాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రజాప్రతినిధులకు స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానాలిచ్చి… అందుకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని వాటిని ప్రజలకు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర సభ్యులు కొన్ని సమస్యలను లేవనెత్తగా కలెక్టర్ గౌతమ్ వారికి అవసరమైన వివరాలు, సమాచారాన్ని, వారికీ తెలిపినారు . అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే త్వరితగతిన పరిష్కరిస్తానని సమావేశంలో సానుకూలంగా తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా అందరి సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌతమ్ సమావేశంలో వివరించారు. జిల్లాలో అధికారులు ఎంతో బాగా తమ విధులు నిర్వహిస్తున్నారని ఇదే స్ఫూర్తితో మరింత బాగా పని చేయాలన్నారు. అలాగే జిల్లాలో గ్రామపంచాయతీల్లో ఆయా బిల్లుల వసూళ్ళు సక్రమంగా జరగడంలేదని ఈ విషయంలో అవసరమైన సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ గౌతమ్ వివరించారు. వీటికి సంబంధించి ఇబ్బందులను వెంటనే పరిష్కరిస్తామన్నారు. దీంతో పాటు ట్యాక్సులు తప్పకుండా వసూలు చేయాలని… ట్యాక్సులు సరిగ్గా వసూలు చేసినట్లయితేనే అభివృద్ధి పనులు చేసుకునేందుకు ఆస్కారముంటుందని ఈవిషయాన్ని అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఉందని… ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన నివేదికలు అందచేస్తామని వారి సూచనల మేరకు నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న వాటిలో చాలా వరకు అలాట్మెంట్ జరిగిందని.. వాటిలో తప్పులున్నాయని తెలిపారని ఈ విషయంలో ఎక్కడైనా తప్పులు ఉన్నాయా ? లేదా ? అనే వివరాలను తెలుసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ గౌతమ్ సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే ఇంకా నిర్మాణం పూర్తి కాని వాటిని పూర్తి చేసి అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, జిల్లా శాఖ అధికారులు, జడ్పీటీసీ సభ్యలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ గౌతమ్ ను సన్మానించిన ప్రజాప్రతినిధులు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ సర్వసభ్య మొట్టమొదటిసారిగా హాజరైన జిల్లా కలెక్టర్ గౌతమ్ను జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, వైస్ ఛైర్మన్ వెంకటేశ్, జడ్పీటీసీ సభ్యలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు,ఎంపీపీలు, శాలువ, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking