30న సొసైటీ ఉపాధ్యక్షుడి ఎన్నిక

 

ఎన్నిక జరగకముందే సొసైటీ గోదాం శిలాఫలకంపై వైస్ ప్రెసిడెంట్ పేరు ముద్రణ

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం మండలంలోని పైనంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉపాధ్యక్షుడి పదవి కోసం ఎన్నిక జరుగనుంది. ఈ నెల 30న సొసైటీ కార్యాలయంలో ఎన్నికను నిర్వహించేం దుకు సహకార అధికారులు ఏర్పాట్లు చేశారు ఆరు నెలల క్రితంఉపాధ్యక్షుడుగా ఉన్న యడ్లపల్లి విజయ్ భాస్కర్ రాజీనామా చేశారు ఆ ఖాళీని భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి, 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు సం ఘంలో సొసైటీ చైర్మన్తో పాటు మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. గతంలో ఉన్న రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలు మారటంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

పాలకవర్గం తీరు వివాదం

ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయ్ భాస్కర్ రాజీనామా చేయటంతో పాలకవర్గం ఆ భర్తీ ని పూర్తి చేసేం దుకు తీర్మానం చేశారు కల్వకుంట్ల శ్రీను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తీర్మానం చేశారు. కానీ సహకార నిబంధనల బైలా ప్రకారం అధికారుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించి ప్రకటించాలి కానీ పైనంపల్లి సొసైటీ కార్యాలయంపాలకవర్గం ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా అభివృద్ధి పనులపై ఉపాధ్యక్షుడు శ్రీను పేరు పెట్టడంతో వివాదంగా మారింది. సొసైటీ గోడౌన్ అక్టోబర్ 1న అప్పటి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన భవనంపై ఉపాధ్యక్షుడు పేరు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే పదవి కి ఎన్నికలు నిర్వహించటం చర్చంశనీయంగా మారిం ది. ఈ విషయంపై డీసీవో ను వివరణ కోరగా గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking