కాంగ్రెస్ యూత్ పట్టణ అధ్యక్షుడు రాందేని చిన్న వెంకటేష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29 : కాంగ్రెస్ అమలు చేస్తున్న అభయ హస్తం పేరుతో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు అర్హులందరు అప్లై చేసుకోవాలని లక్షెట్టిపేట కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రాందేని చిన్న వెంకటేష్ పేర్కొన్నారు.శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…అర్హులంతా తమకు కావలసిన పథకాల అన్నిటికి ఓకే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆవరసరమైన ఆధార్,రేషన్ కార్డు నకలు ప్రతులను అందజేయాలన్నారు.ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్,గ్రామ సిబ్బంది కార్యకర్తలు పాల్గొన్నారు.