తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్టులో పనిచేస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు (Cadre Public Prosecutors) అందరూ హైదరాబాదులో సమావేశమై వారి యొక్క సమస్యలపై చర్చించుకున్నారు. ఈ సమావేశంలో సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ ప్రస్తుతం ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో వారికి కావలసినటువంటి ప్రమోషన్స్ మరియు ఇతర సమస్యలపై ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి కొంతమంది న్యాయవాదులు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పై చేస్తున్న నిరాదార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనేకమంది సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను న్యాయవాదులుగాని సామాన్య ప్రజలు గానీ నమ్మవద్దని సూచనలు చేసినారు. తెలంగాణలో ప్రస్తుత డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆమె విధులలో జాయిన్ అయినా అప్పటి నుంచి ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ లో అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చి డిపార్ట్మెంట్ కి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినారు అని సీనియర్ మరియు జూనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ ఆమె తీసుకువచ్చిన సంస్కరణల విషయంలో అందరూ ఎంతో సంతృప్తిని వ్యక్త పరిచినారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి కేడర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఈ సమావేశానికి హాజరై వారి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించినారు.