ప్రతి వైద్యుడు సేవాభావంతో రోగులకు వైద్యం చేయాలి

కూకట్పల్లి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ బండి రమేష్‌
ప్రజాబలం కూకట్పల్లి : వైద్యో నారాయణ హరి అన్నట్టు ప్రతి వైద్యుడు సేవాభావంతో రోగులకు వైద్యం చేయాలని కూకట్పల్లి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ బండి రమేష్‌ అన్నారు. మూసాపేట కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ఎండి చున్ను పాష ఆధ్వర్యంలో నవ యువక యూత్‌ అసోసియేషన్‌ వద్ద ఏర్పాటుచేసిన ఫ్రీ మెడికల్‌ క్యాంపును రమేష్‌ గురువారం ప్రారంభించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ మహమ్మద్‌ ముస్సి నీ రమేష్‌ అభినందించారు షుగర్‌ అండ్‌ థైరాయిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య పరీక్షలు మూసాపేట పరిధిలో పలు బస్తీల్లో వారం రోజులు పాటు కొనసాగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేణు, శ్రీను, సంతోష్‌, మల్లేష్‌ యాదవ్‌, మహేష్‌ గౌడ్‌ నయీం మోసిన్‌ జోజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking