ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 24 : పదవ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి10 జిపిఏ సాధించాలని మహాత్మ మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్ సూచించారు.మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలనుబుధవారం ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల నేపథ్యంలో జరుగుతున్న స్లిప్ మే ఘటెస్ట్ లను ఆయన పరిశీలించారు.విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ…యుద్ధ కాలం చదివింది ఒక ఎత్తని ఇప్పుడు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలని అప్పుడే 10 జీపీఎ సాధించడం సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడు నిర్వహిస్తున్న స్లిప్ టెస్ట్ లలో ప్రతి సబ్జెక్టులో 40 మార్కులు ఉంటాయని అట్టి పరీక్షలను మంచిగా రాసినట్లయితే వార్షిక పరీక్షల్లో సులభంగా వందకు వంద శాతం మార్కులు సంపాదించవచ్చునని అన్నారు.లక్షం ముందు ఉంచుకొని చదివినట్లయితే విజయం తద్యమన్నారు.గత విద్యా సంవత్సరం కూడా ఈ పాఠశాలలో పదవ తరగతితో పాటు ఇంటర్మీడియట్లో 100% విద్యార్థులు సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు.ఈ విద్యా సంవత్సరం అంతకంటే ఎక్కువగా ఉత్తీర్ణత శాతం పెంచాలని కోరారు. గురువులతోపాటు, తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు వస్తుందని చెప్పారు.విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలి గాని అడియాసలు చేయవద్దన్నారు.కష్టపడి కాదు ఇష్టంగా చదివినట్లయితేనే విజయం సాధించవచ్చునన్నారు. అనంతరం పలు అంశాలపై సలహాలు సూచనలు అందజేశారు.విద్యార్థికి పదవ తరగతిలో ఉత్తీర్ణులు అయితేనే భవిష్యత్తు ముందుకు సాగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.ఈ సమావేశంలో ప్రిన్సిపల్ గౌతమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.