ఏస్ ఏస్ ఏస్ యువ సేన ఆధ్వర్యంలో యువజన దినోత్సవ కార్యక్రమంలో ఉచిత పతంగుల పంపిణీ
ఎన్ ఎస్ ఎస్ యువసేన వ్యవస్థాపకుడు మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ జనవరి 12:సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, వ్యవస్థాపకుడు మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నాచారం వైజయంతి వద్ద
ఏస్ ఏస్ ఏస్ యువ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువజన దినోత్సవానికి, ఉచిత పతంగుల పంపిణీ కార్యక్రమానికి సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పతంగులను ఎగుర వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చైనా మంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజా తో తలెత్తే అనర్థాల పై అందరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయని అన్నారు. చైనా మాంజా వాడకుండా కాటన్ దారం వాడాలని సూచించారు. మంజా దారం సైనికుడి ప్రాణాల్ని తీసిందన్నారు. యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఏ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుంటుక కృష్ణా రెడ్డి, మామిడాల రాజారెడ్డి, రాకేష్, బాలు, గద్ద క్రాంతి కిషోర్, జావీద్ .మధు సూధన్ రెడ్డి మాజీ సైనికుడు ఎస్ఎస్ యువసేన సబ్యులు రమాకాంత్ లోకే, కిషోర్ రెడ్డి, సాయిచంద్, ఆరెళ్ల శ్రీధర్, సురేందర్, మహేష్ రెడ్డి, ఆలేటి శ్రీకాంత్, అక్షంత్, విజయ్, రాజు, కమల్, సెబాస్టియన్ తదితరులు పాల్గొన్నారు.