ప్రకాష్ అడ్స్ అధినేత ఓం ప్రకాష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 30 : భగవాన్ సత్య సాయి చెప్పినట్టుగా మానవ సేవకు ప్రతిఒక్కరు ముందుకు రావాలని ప్రకాష్ అడ్స్ అధినేత సూరం ఓం ప్రకాష్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలో శ్రీ శివ సాయి గణేష్ సేవ సమితి సభ్యులు సూరం వైష్ణవి ఓం ప్రకాష్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన నిరుపేద కళావతి కుటుంబానికి 6500 విలువగల కుట్టు మిషన్ అందజేశారు.కళావతి 2000 రూపాయలు,పెళ్లిరోజు దంపతులు ఓం ప్రకాష్ వైష్ణవి 2500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాటిబండ్ల ప్రసన్న శ్రీరామమూర్తి,నార్ల సుమతమ్మ,తాటికొండ శ్రీనివాస్,నల్మాస్ శ్రీనివాస్, చిటుమల్ల సప్తగిరి,నరేందుల భీమన్న,రామన్న,పల్లెల రవి తదితరులు పాల్గొన్నారు.