జూన్ 26 ప్రజాబలం న్యూస్ తూప్రాన్ :-
డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి తెలిపారు.అంతర్జాతీయ ఆంటీ డ్రగ్స్ దినోత్సవ సందర్భంగా తూప్రాన్ పోలీస్ స్టేషన్ నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులు యువకులచే డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ కు అలవాటు పడిన వాడిన విక్రయిస్తున్న రవాణా చేస్తున్న ఎలాంటి సమాచారం అయినా పోలీసులకు తెలుపాలని వారి పేరు గోప్యంగా ఉంచుతామని తెలిపారు డ్రగ్స్ వాడటం వల్ల కుటుంబాన్ని నాశనం చేస్తుందని డ్రగ్స్ కు దూరంగా ఉండాలనియువతను కోరారు నేటి యువత దేశానికి భవిష్యత్తు అని యువత డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు
మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై
జరుగుతున్న పోరాటం లో క్రియాశీల భాగస్వామిని అవుతానని , డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురుంచి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి, నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ భారిన పడకుండా కృషి చేస్తానని,
డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ కు తెలియచేస్తానని,
డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని,
డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినౌతానని , ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి , తూప్రాన్ తాసిల్దార్ విజయలక్ష్మి, ఎస్ఐ శివానందం, మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు ,ప్రజా ప్రతినిధులు కమిషనర్ ఖాజామీజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు..