ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 20 (ప్రజాబలం) ఖమ్మం రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతో పాటు, ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. ఫోటో ఎలక్టోరల్ రోల్ కు సంబంధించి, పెండింగ్ దరఖాస్తులు అన్ని పరిష్కరించాలని, ఓటర్ల జాబితా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లా ఎన్నికల ప్రణాళిక తో పాటు, నియోజకవర్గ వారిగా, పార్లమెంట్ నియోజకవర్గ వారిగా ఎన్నికల ప్రణాళిక రూపొందించాలన్నారు. సెక్టార్ అధికారుల నియామకం చేపట్టి, వల్నరబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టి, వీడియో సర్వీలెన్స్, వీడియో వివింగ్ టీముల, అసిస్టెంట్ వ్యయ పరిశీలకుల ఏర్పాటు చేయాలన్నారు. రాజకీయ పార్టీలతో సమావేశమై రేట్ చార్ట్ సిద్ధం చేసుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సమర్పించాల న్నారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఎస్ఎస్ఆర్ ప్రక్రియ సమయంలోగా పూర్తి చేస్తామని, సంబంధిత అన్ని దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరిస్తామని అన్నారు. ఏఎస్డి జాబితా ప్రకారం ఫారం-7, 8 లను అప్లై చేయించాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఆర్డీవో లు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking