పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ దృష్టికి తెచ్చారు. నియోజకవర్గాల వారీగా ప్రతిరోజూ తాను సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమీక్షిస్తున్నానని, ఈ నెల 25 వ తేదీ లోపు అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నామని ఎన్నికల విధులు నిర్వహించడంలో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నాము అని తెలిపినారు.
అనంతరం జిల్లా కలెక్టర్ గౌతమ్, అధికారులతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా నిర్వహణపరమైన ఏర్పాట్లపై దృష్టిని కేంద్రీకరించాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశించిన అంశాలతో కూడిన వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా పక్కాగా ఉండాలని, మార్పులు, చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ లో పెట్టకూడదని సూచించారు. ఓటరు జాబితాలో ఇంకనూ ఎక్కడైనా చిరునామాలు, అస్పష్టమైన ఫోటోలు ఉన్నట్లయితే జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అలాంటి వాటిని సవరించాలని అన్నారు. 2024 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా విస్తృత చర్యలు చేపట్టాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలను ఖరారు చేయాలని, నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, భద్రతాపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తూ, నివేదికలు సమర్పించాలని అన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో,అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డి జిల్లా రెవిన్యూ అధికారి హరిప్రియ, ఈఆర్వోలు, ఎన్నికల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking