ఇల్లందకుంట ప్రజాబలం జనవరి 18
ఇల్లందకుంట మండలం సిరిసేడి గ్రామంలో గురువారం జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాడుల నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ సిరిసేడు గ్రామానికి చెందిన దుగ్యాల పరమేష్ అని వ్యక్తి వద్ద20 లీటర్లు నాటు స్వాధీనం చేసుకున్నారు 375 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు సదరు నిందితుడు పరమేష్ పోలీసులను రాకను గమనించి పారిపోయినట్లు వివరించారు ఈ దాడుల్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీనివాస్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు