అర్హులందరికీ రైతు భరోసా

 

పది ఎకరాల్లోపు రైతులందరికి రైతు భరోసా ఇవ్వాలి

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్

చలో ఉట్నూర్ రైతు భరోసా యాత్రకు తరలిన రైతులు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 11 : అర్హులందరికీ రైతు భరోసా,పది ఎకరాల్లోపు రైతులందరికి రైతు భరోసా ఇవ్వాలని మండల అధ్యక్షులు పింగిలి రమేష్ అన్నారు. గురువారం మండలంలోని వివిధ గ్రామాల నుండి ఉట్నూర్ లో జరిగే రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ కోసం నిర్వహించే సభకు మండల రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రైతుల అభిప్రాయం స్వీకరించడం చాలా మంచి పరిణామమన్నారు. గత ప్రభుత్వం ఇష్టారీతిన నిధులు దుర్వినియోగం చేశారన్నారు.శాస్త్రీయ పద్దతిలో ప్రభుత్వ పథకాలు నిర్వహించడంతో నిజమైన అర్హులకు లబ్ది కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నల్లపు పోచన్న, పొలసాని రవీందర్రావు,గౌరెల్లి రవీందర్రావు,సందెల సురేష్, ధుమ్మని సత్యం,దుంపల ప్రేమ్ సాగర్,కందుల లింగన్న,సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking