అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా పురుషుల వంధ్యత్వ సమస్యను పరిష్కరించడానికి ‘ఆండ్రోమాక్స్’ని ప్రారంభించిన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్
తిరుపతి మరియు రాజమండ్రిలలో రెండు కొత్త కేంద్రాలను ప్రారంభించడం ద్వారా తమ కార్యకలాపాలను విస్తరించింది
హైదరాబాద్, జూన్ 15, 2024: అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా, దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ ఐవిఎఫ్ చైన్‌లలో ఒకటైన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, పెరుగుతున్న పురుషుల వంధ్యత్వ సమస్యకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి పూర్తిగా అంకితం చేసిన ‘ఆండ్రోమ్యాక్స్’ని ప్రారంభించినట్లు వెల్లడించింది. ప్రఖ్యాత భారతీయ నటి శ్రీమతి సంగీత సమక్షంలో హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించిన వేడుక లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
అధునాతన సాంకేతికతలు మరియు నైపుణ్యంతో కూడిన సంరక్షణను ‘ఆండ్రోమ్యాక్స్’ మిళితం చేయడంతో పాటుగా ఒకే చోట పురుషుల వంధ్యత్వానికి సంబంధించిన సమగ్ర పరిష్కారాలను అందిస్తుంది. అత్యున్నత అర్హత కలిగిన ఐవిఎఫ్ నిపుణులు, శిక్షణ పొందిన ఎంబ్రియాలజిస్ట్‌లు మరియు ఆండ్రాలజిస్ట్‌లతో కూడిన బృందం మల్టీడిసిప్లినరీ విధానంతో పురుష సంతానోత్పత్తి యొక్క సూక్ష్మ అవసరాలను సైతం తీర్చడమే ‘ఆండ్రోమ్యాక్స్’ లక్ష్యం. అత్యున్నత స్థాయి సంరక్షణ మరియు విజయ శాతం నిర్ధారించడానికి ఈ కేంద్రం ప్రపంచ ప్రమాణాలు మరియు మార్గదర్శకాలను అనుసరిస్తుంది.
ఒక అధ్యయనం ప్రకారం* జంటలలో సంతానలేమికి 40-50% స్త్రీ సంబంధిత సమస్యలు కారణమని అంచనా వేయబడింది, పురుష కారణాల వల్ల వంధ్యత్వం పెరుగుతోంది. అది సంతానలేమి జంటలలో 30-40% ఉంటుంది. అంటే ప్రతి 100 జంటలు గర్భం దాల్చేందుకు ప్రయత్నిస్తే వారిలో 30-40 మంది పురుష వంధ్యత్వం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురుషుల వంధ్యత్వానికి ప్రధాన కారణాలలో స్పెర్మ్ (వీర్య కణాలు) కౌంట్ తక్కువ, పేలవమైన వీర్య నాణ్యత మరియు పునరుత్పత్తి మార్గంలో అడ్డంకులు వంటివి ఉంటున్నాయి. తమ సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి అధిక అవగాహన ఉన్న స్త్రీలకు భిన్నంగా, పురుషులలో అధిక శాతం మందికి తమ స్వంత పునరుత్పత్తి ఆరోగ్యం గురించి తగినంత పరిజ్ఞానం ఉండటం లేదు.
ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సీఈఓ శ్రీ వినేష్ గాధియా మాట్లాడుతూ , “దేశవ్యాప్తంగా పురుష సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నప్పటికీ, ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో, పురుష వంధ్యత్వానికి అవసరమైన శ్రద్ధ చూపటం లేదని మేము అర్థం చేసుకున్నాము. మా సమగ్ర పురుష వంధ్యత్వ సేవలను ప్రారంభించడం ద్వారా, తండ్రులుగా మారే వారి ప్రయాణంలో పురుషులు మరియు వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము, వారిలో ఆశలను రేపటంతో పాటుగా ప్రకాశవంతమైన భవిష్యత్తును సృష్టించడం చేస్తున్నాము. సమగ్రమైన విధానంతో, మేము కథనాన్ని మార్చగలము మరియు భారతదేశమంతటా పురుషుల కోసం సంతానోత్పత్తి ఫలితాలను మెరుగుపరచగలము ” అని అన్నారు.
ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి బుడి మాట్లాడుతూ , “ఆండ్రోమ్యాక్స్’ ప్రారంభించడం అనేది పురుషుల సంతానోత్పత్తి సవాళ్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని మా సేవా ఆఫర్‌లను మెరుగుపరచడంలో కీలకమైన ముందడుగు. అత్యున్నత స్టాయి వైద్య నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికత మరియు దయతో కూడిన సంరక్షణ విధానంను ఇది మిళితం చేస్తుంది. ఈ సేవలతో , మేము వ్యక్తిగత పరిస్థితులను మరియు అవసరాలను తీర్చగలిగే రీతిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన చికిత్సా ప్రణాళిక ద్వారా పురుష వంధ్యత్వానికి సంబంధించిన పలు అంశాలను పరిష్కరించనున్నాము. మా లక్ష్యం కేవలం గర్భధారణలో సహాయం చేయడమే కాకుండా వారి గోప్యత మరియు గౌరవానికి భంగం కలిగించని వాతావరణంలో వారి పునరుత్పత్తి ఆరోగ్యానికి బాధ్యత వహించేలా పురుషులను శక్తివంతం చేయడం ” అని అన్నారు.
పురుష సంతానోత్పత్తి అనేక రకాల ఆరోగ్య సమస్యల ద్వారా ప్రభావితమవుతుంది, ఇది జీవనశైలి అంశాలు లేదా వైద్యపరమైన రుగ్మతలను వెలికితీసేందుకు క్షుణ్ణంగా రోగిని మూల్యాంకనం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఫెర్టీ9 యొక్క సమగ్రమైన మరియు అంకితమైన సేవ పురుషుల వంధ్యత్వ సమస్యలను ఖచ్చితమైన స్క్రీనింగ్ మరియు మూల్యాంకనం నుండి తగిన పరిష్కారాలు మరియు మానసిక మద్దతు వరకు – అన్నీ ఒకే పైకప్పు క్రింద పరిష్కరించడంలో సహాయం చేస్తుంది.
ఫెర్టి9 ఫెర్టిలిటీ సెంటర్, మేల్ ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్. శశాంత్ మాట్లాడుతూ , “సంతానలేమి జంట్లలో 30-40% మంది వంధ్యత్వానికి కారణం పురుష కారకం. పురుష వంధ్యత్వం అనేది సంక్లిష్టమైన సమస్య, దీనికి ప్రత్యేక శ్రద్ధ మరియు సంరక్షణ అవసరం. మా సౌకర్యం సమగ్రమైన సేవలను రోగ నిర్దారణ మరియు పురుష వంధ్యత్వానికి చికిత్సను లక్ష్యత విధానంలో అందిస్తుంది.మేము పురుషుల పునరుత్పత్తి ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి మరియు ఫలితాలను మెరుగుపరిచే పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. పరిశోధన మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడం ద్వారా, ‘ సంతానోత్పత్తి చికిత్సలలో అంతరాన్ని తగ్గించడం మరియు పితృత్వపు ప్రయాణంలో పురుషులకు మద్దతు ఇవ్వడం ‘ఆండ్రోమాక్స్ లక్ష్యంగా పెట్టుకుంది” అని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే తిరుపతి మరియు రాజమండ్రి లలోని రెండు కొత్త కేంద్రాలను వర్చువల్ వీడియో ద్వారా శ్రీమతి సంగీత ప్రారంభించారు.
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి , శ్రీమతి సంగీత తన మద్దతును తెలియజేస్తూ , “తండ్రుల కోసం అంకితం చేయబడిన ఈ ప్రత్యేక మైన రోజున హాజరుకావడం గౌరవంగా భావిస్తున్నాను. సంతానోత్పత్తి అనేది ఇద్దరు భాగస్వాములతో కూడిన ప్రయాణం, మరియు ఈ ప్రయాణంలో పురుషులు పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదనే భరోసాను ఫెర్టీ9 అందిస్తుంది. పురుష వంధ్యత్వ సమస్య పట్ల అవగాహన కల్పించే రీతిలో ప్రారంభించిన ఫెర్టీ9 యొక్క కార్యక్రమంకు నేను నిజంగా మద్దతు ఇస్తున్నాను. మరింత శ్రద్ధ మరియు సానుభూతి చూపవలసిన అంశం ఇది. రాష్ట్రంలో రెండు కొత్త కేంద్రాలను ప్రారంభించినందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జంటలకు అసాధారణమైన సంరక్షణ మరియు సేవలను అందించడంలో నిరంతరం ప్రయత్నాలను చేస్తున్న ఫెర్టీ9కి నా శుభాకాంక్షలు…” అని అన్నారు.
నూతన సేవల ప్రారంభం తో పాటుగా రెండు కొత్త కేంద్రాల ప్రారంభోత్సవం సందర్భంగా, ఫెర్టీ9 పరిమిత కాల వ్యవధి పాటు ఐవిఎఫ్ విధానాలపై 25% తగ్గింపును అందిస్తుంది.