తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఫిలిం చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్

తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారత సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఫిలిం చాంబర్ చైర్మన్, ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకులు, డిస్ట్రీబ్యూటర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జె. వెంకటేశ్వర్ రావు, గౌరవ అధ్యక్షులుగా తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్, తెలుగు రాష్ట్రాల కౌన్సిల్ అధ్యక్షులుగా కొవ్వూరి భాస్కర్ రావు, ఉపాధ్యక్షులుగా గురురాజ్, వెంకటేశ్, సహాయ కార్యదర్శులుగా ప్రముఖ దర్శకుడు సముద్ర, రాజు, కార్యదర్శులుగా ఆకుల బాలకృష్ణ, పొలాస వాసు, భక్తవత్సలం, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దేశెట్టి శివకుమార్, నగర గౌరవ అధక్షులుగా ఆర్వీ మహేందర్ కుమార్ నియమితులయ్యారు.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అరవై శాతం జనాభా ఉన్న వెనుకబడిన తరగతుల వారు ఇప్పటికి అధికారానికి దూరంగానే ఉన్నారని, బీసీ ల హక్కుల కోసం ఇంకా పోరాటం చేయాల్సిన పరిస్థితే ఉందని తెలిపారు.రాష్ట్ర జనాభాలో అగ్రపీఠం బీసీ లదే ఐనా, బీసీ ల హక్కుల కోసం నేటికీ అడుక్కోవాల్సిన దుస్థితి మారలేదన్నారు. బీసీ ల సాధికారత కోసం, సంఘం ఆశయాలను నెరవేర్చటం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లు సాధించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. త్వరలోనే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేస్తామని తెలిపారు. డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ బీసీలు అందరు రాజకీయంగా చైతన్యం కావాలని, త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు కులగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking