జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం రాపెళ్ళి అమృత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు,భర్త గత పది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో,చనిపోయాడు,అన్ని తానై రోజువారీ కులి పనులు చేసి ఇద్దరు కూతుర్లను పోషిస్తుoది.ఇటీవల పెద్ద కూతురు మానస అనారోగ్యానికి గురైంది, కష్టపడి పిల్లల చదువులకోసం పోగు చేసుకున్న డబ్బు మొత్తం మానస వైద్యానికే కర్చయ్యాయి,స్తోమతకి మించి వైద్యం చేయించినప్పటికి కూతురు మానసను కాపడలేకపాయింది.కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వేడుకుంటుంది ఆ తల్లివిషయం తెలుసుకున్న మన జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు ఆ కుటుంబానికి 5,000/- వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసారు.ఈ సహాయ కార్యక్రమంలో గడ్డం రాంచందర్,ఎలుతపు శ్రీనివాస్(సర్పంచ్),గుర్రాల రమేష్,కుషల్,సత్తయ్య,మల్లేష్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking