నిబంధనలు ఉల్లంఘించిన క్లినిక్ ల పై కొరడా

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 3:
తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్సి చేసిన ఫార్సుల ఆధారంగా, 03-04-2024న,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి,
డాక్టర్ టి. రఘునాథస్వామి మరియు మల్కాజిగిరి డివిజన్ డిప్యూటీ జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డాక్టర్
ఆనంద్ వారి బృందం తో కలసి అన్హరత డాక్టర్ మరియు నమోదుకాని పాలీ క్లినిక్‌లు మరియు ఆసుపత్రులను షాపుర్నగర్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు,

📍ఆర్ ఆర్ శ్రీజన్ క్లినిక్
📍శ్రీ వీరభద్ర ఫస్ట్ ఎయిడ్ క్లినిక్
📍పూర్ణ ల్యాబ్

తనిఖీల్లో భాగంగా క్లినీలల్లో / ల్యాబ్లో దొరికిన వైద్య పరికరాలు, శస్త్రచికిత్స కత్తెరలు, ప్రొసీడ్యూరల్ మెటీరియల్స్, ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, ఎక్స్పైరీ మందులు వంటివి ఆధారంగా ఇది రుజువైంది.

యాజమాన్యం అర్హత కలిగిన వైద్యులు మరియు సిబ్బంది లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఆసుపత్రిని నడుపుతోంది, ఇది ప్రజలకు మరియు ముఖ్యంగా అమాయక ప్రజలకు నష్టం కలిగిస్తుంది అని తెలిపారు,

ఈ క్లినిక్‌లు చట్టవిరుద్ధంగా అర్హత కలిగిన వైద్యులచే నమోదు లేకుండా చిన్న శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నాయి, అనుమతి లేకుండా వైద్య నిపుణులుగా ప్రాక్టీస్ చేసి ప్రచారం చేసుకుంటున్నారని కూడా గమనించారు, దీంతో డీఎంహెచ్‌ఓ బృందం, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో ప్రజారోగ్యానికి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్స్ & రెగ్యులేషన్) యాక్ట్ 2010 (కేంద్ర చట్టం No 23 of 2010) & రూల్స్ 2022 ప్రకారం క్లినిక్లను సీజ్ చేయడం జరిగింది .

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన ఏ ఆసుపత్రియిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

యి కార్యక్రమంలో డాక్టర్ నవనీత, వైద్యాధికారి, యుపీహెచ్‌సీ షాపుర్నగర్,
అంజన్న డెమో ,
శ్రీ పి శ్రీనివాస్, MPHA(m)
తనిఖీలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking