ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలి

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రం ఆవిష్కరించిన కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 24:
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి కిషన్తో కలిసి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల2024, కు సంబంధించిన కరపత్రాన్ని, బ్యానర్, లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మోటారు వాహనాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ప్రస్తుత వేగవంతమైన, పోటీతత్వంలోని మానవతప్పిదాల వల్ల, అతివేగంగా వాహనాలను నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ గౌతమ్ వివరించారు. ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు విచ్చిన్నం కావడంతో పాటు ఎంతో మంది క్షతగాత్రులు కావడం ఎంతో బాధాకరమని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. దీంతో పాటు రహదారి ప్రమాదాలతో వారిపై ఆధారపడిన కుటుంబాలు సైతం అనాధలవుతున్నాయని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని కలెక్టర్ సూచించారు. అలాగే అతివేగం ప్రమాదకరమని మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని డ్రైవింగ్ లైసెన్సులు లేని వారు వాహనాలు నడపరాదని కలెక్టర్ గౌతమ్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ గౌతమ్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking