.అంగన్వాడీ కార్యకర్తలకు 65ఏండ్లకు విరమణ పొడాగించిందుకు తెలంగాణ తల్లి విగ్రహానికి ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.ఆగస్టు 26 నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రమైన కుభీర్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు ఆయాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏండ్లు గా పెంచడంతో పాటు ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ టీచర్లకు 1లక్ష ఆయాలకు 50వేలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలపడంతో వారు శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శనివారం అంగన్వాడీ టీచర్లు ,ఆయాలు కలసి తెలంగాణ తల్లి విగ్రహానికి ,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాభిషేకం చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తల కు ఉద్యోగ విరమణ తో పాటు వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు ఆయా గ్రామంలో ఉన్న టీచర్లు సంబరాలు జరుపుకున్నారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ మండల అధ్యక్షురాలు సత్యశిలా ప్రాజెక్టు అధ్యక్షురాలు అనుసయా,అరుణ,గంగామణి,జ్యోతి ఆయా గ్రామాల టీచర్లు మినీ టీచర్లు ఆయాలు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking