మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకానికి జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి డిసెంబర్ 9

వయస్సుతో భేదం లేకుండా ప్రతి ఒక్క మహిళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని జిల్లాకలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.
శనివారం వరంగల్ జిల్లా టి ఎస్ ఆర్ టి సి ఆధ్వర్యంలో చేపట్టిన మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ
మహాలక్ష్మి పథకాన్ని వరంగల్ ఎంజీఎం వద్ద జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఎంజీఎం నుండి మహిళలతో కలసి ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యంతో కలెక్టర్ ప్రయాణించి మహిళలకు 0% టికెట్ అందించి మహిళలతో మమేకమై వరంగల్ బస్ స్టాండ్ వరకు ప్రయాణించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలలో మహాలక్ష్మి పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేద మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.
జిల్లాలోని టి ఎస్ ఆర్ టి సి ద్వారా సిటీ బస్సులు 57, పల్లె వెలుగు 471, ఎక్స్ ప్రెస్ 213 బస్సులలో మహాలక్ష్మి పథకం అమలవుతుందని చెప్పారు. జిల్లాలో ఉన్న మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద మహిళలకు త్వరలో ప్రభుత్వం ‘మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్’ అందించనుందని అన్నారు.
మహాలక్ష్మి పథకం కొన్ని నిబంధనలు ఉంటాయని అన్నారు. ఉచిత బస్సులో ప్రయాణించాలంటే తెలంగాణకు చెందిన మహిళలు అయి ఉండాలని, స్థానిక ధ్రువీకరణ పత్రాలలో ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులు ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలనీ,
తెలంగాణ సరిహద్దు లోపల ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించొచ్చనీ అన్నారు.పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పాటు, హైదరాబాద్‌లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితం అని
బయటి రాష్ట్రాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణ సరిహద్దు వరకే ఉచితంగా వెళ్లగలరు, తరువాత టికెట్ కొనాలనీ అన్నారు. కిలోమీటర్ల పరిధిలో లేవని ప్రతి మహిళకు జీరో టికెట్ వర్తిస్తుందని అన్నారు. దానికి సంబంధించిన చార్జీలను ప్రభుత్వం టిఎస్ఆర్టిసి కి చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, టిఎస్ఆర్టిసి డిప్యూటీ రీజనల్ మేనేజర్ భాను కుమార్, ఆర్టీసీ వరంగల్ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking