మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 30 :
ట్రస్మా మందమర్రి బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని ఎల్.ఐ. సి కార్యాలయ వద్ద ఉచితంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దామెర సిద్దయ్య మాట్లాడుతూ 2021 వరకు డిగ్రీ, ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో చేసుకున్న వారు కూడా మళ్లీ నూతనంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ట్రస్మా ఆధ్వర్యంలో పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొరకు ఓటును ఉచితంగా నమోదు చేయబడుతుందని ఈ అవకాశాన్ని పట్టబద్రులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా కోశాధికారి ఉదారి చంద్రమోహన్ గౌడ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, రామ్ వేణు, మందమర్రి మండలం గౌరవ అధ్యక్షుడు పోల్ శ్రీనివాస్, రామసాని శేఖర్ తదితరులు పాల్గొన్నారు.