ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 01 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల యంపిపి గడ్డం శ్రీనివాస్ జన్మదిన వేడుకలను తన మిత్ర బృందం ఆకుల రాజేందర్,గడ్డం రాంచంధర్,కళ్లెం రాజన్నలు ఆదివాసీ గ్రామం కోయపోచాగూడెం నందు మొత్తం మహిళా ఆదివాసులకు దుప్పట్లు పంపిణి చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దండేపల్లి యంపిపి గడ్డం శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా మిత్రులు అందరం కలిసి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉద్యోగులు వెంకటేష్,సునీల్ నాయకులు స్వామి,లచ్చు పటేల్,బాపు, రమేష్,నవీన్,తిరుపతి,దయాకర్, రాజశేఖర్ స్థానిక నాయకులు, శంకర్,శ్రీను,రామయ్య,లచ్చయ్య,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.