జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 2
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిసిసి మేంబర్ పత్తి కృష్ణారెడ్డి సోదరుడు పాత్రికేయుడు పత్తి విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈరోజు వారి కుటుంబాన్ని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గంగాడి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ విష్ణువర్ధన్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా హుజురాబాద్ డివిజన్ పరిధిలో పాత్రికేయ రంగంలో పనిచేసి అనేక రకాల ప్రజా సమస్యలను వెలికి తీసి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ప్రజల పక్షాన నిలబడే వారని కొనియాడారు. వారి మృతి పత్రిక రంగానికి,ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటు ఆని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనో ధైర్యం కల్పించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు వెంట జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గం కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, మల్లేష్ జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లపు రవి, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు ఊడుగుల రవి కుమార్ తదితరులు ఉన్నారు.