డాక్టర్ జానకిరామ్ గారిని సన్మానించిన గైనిభైటి ఆంజనేయులు గౌడ్ మహేష్ రెడ్డిలు

 

తూప్రాన్ , నవంబర్, 2 ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ ముద్దుబిడ్డ, ప్రముఖ సంఘ సేవకుడు, సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్ గారికి అమెరికా తయాలజికల్ రిసెర్చ్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా శనివారం ఉదయం కొంపల్లి 100 డయల్ పోలీస్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పోలీస్ గైనిభైటి ఆంజనేయులు గౌడ్, అతని మిత్రుడు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఆరోఖ్య మిల్క్ డిస్ట్రిబ్యూటర్ కొoరెడ్డి మహేష్ రెడ్డి తో కలిసి పచ్చని మొక్క గిఫ్ట్ గా అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనీ మెదక్ జిల్లాలో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న జానకిరామ్ గారికి అమెరికా లోని తయోలాజికల్ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్ పట్టా రావడం అరుదైన విషయం అని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తూప్రాన్ బైపాస్ రోడ్డు పక్కన టెంట్ వేసుకొని జాతీయ రహదారి గుండా కాలి నడకన వెళుతున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలకు తినడానికి పులిహోర ప్యాకిట్లు, త్రాగడానికి వాటర్ బాటిళ్లు, నడిచి నడిచి కాళ్ళు బొబ్బలు ఎక్కితే అయింట్మెంట్ తోపాటు 500 పాదరక్షలు, 3 లక్షల విలువ చేసే నిత్యావసర సరకులు పంపిణీ చేయడం తోపాటు. తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలోనే ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న జానకిరామ్ అన్నగారికి నేడు విశ్వ విఖ్యాత నగరం అమెరికా యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పట్టా రావడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందని అన్నారు. జానకిరామ్ అన్న గారితో కలిసి సి2 చానెల్ ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేసినప్పుడు మార్గనిర్దేశకులుగా ఉత్తమ విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి కార్యోన్ముఖులను చేసిన ఘనత జానకిరామ్ అన్నగారిదని పేర్కొన్నారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చాలా మంది విలేఖరులకు శిక్షణ ఇచ్చి ఎందరో జీవితాలు నిలబెట్టిన మహానుభావుడని అలాంటి గురువు గారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన చిరు సత్కారం చేయడం అమితమైన సంతోషంగా ఉందని అన్నారు. అంతే కాకుండా పాత జ్ఞాపకాల దొంతరలు గుర్తు చేసుకొని జానకిరాం సార్ కు గౌరవ డాక్టరేట్ రావడం పట్ల తమేకే వచ్చినట్లు ఫీల్ అయ్యి గర్వంగా ఉందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking