GMPS పాదయాత్ర విజయవంతం చేయండి

జనగామ జిల్లా,దేవరుప్పుల మండలం, సింగరాజుపల్లి గ్రామంలో GMPS దేవరుప్పుల మండల అధ్యక్షులు భూమండ్ల కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర నాయకులు జాయ మల్లేశం  మాట్లాడుతూ ఈనెల జరిగే 20వ,21వ తేదీన దొడ్డి కొమురయ్య స్తూపం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను చేయాలని.. తెలంగాణ రాష్ట్ర సి.ఎం. కె.సి.ఆర్.గారు రెండోవిడత గొర్రెలను పంపిణీ చేయాలని..ఈ GMPS పాదయాత్రలో గొల్ల,కురుమలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని..పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో GMPS జిల్లా కోశాధికారి కన్నెబోయిన బాలరాజు, జోగు మహేందర్, జోగు సోమరాజు, జోగు మహేష్, నోముల సురేష్, దామెర మహేందర్, బోమండ్ల వెంకన్న, కర్రె శ్రీకాంత్, జెటంగి పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్:జి.సుధాకర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking