ప్రజాపాలనతో ప్రజలకు మేలు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల సేవలు, సౌకర్యాలు అందించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ప్రజాపాలన వల్ల మేలు జరుగుతుందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని మొదటిరోజైన గురువారం ఘట్కేసర్ మండలం కాచవని సింగారంలో, జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం కీసర మండలంలోని బోగారంలో, శామీర్‌పేట మండలంలోని తుర్కపల్లి. యాడారం గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి గ్రామసభ ను సందర్శించారు అక్కడి వివరాలను స్థానిక అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు సంబంధించిన లబ్ధిదారులకు ఫారాలు సరిగ్గా అందాయా వాటిని ఎలా భర్తీ చేశారు తదితర వివరాలను ప్రజలను అడిగి తెలుసుకొన్నారు. దీంతో పాటు పలువురు పూరించిన దరఖాస్తు ఫారాలను అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరు రకాల సేవలందిస్తోందని దీనికి సంబంధించిన ఫారాలను ఆయా గ్రామాల్లో ముందుగానే అందచేసి వాటికి సంబంధించి లబ్ధిదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డులను జత చేసి ఫారాన్ని నింపి సంబంధిత అధికారులకు అందచేయాల్సిందిగా తెలిపారు. ప్రతి అర్హులైన లబ్ధిదారులు ప్రజాపాలనలో ఫారాలను నింపి అధికారులకు అందచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల తహశీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking